అమ్మాయిని టార్చర్ చేసిన ఐదుగురు నిందితుల చిత్రాలు విడుదల

ఐదుగురు పురుషులు కలిసి ఒక మహిళ ని టార్చర్ చేశారు. ఈ దారుణ సంఘటన అస్సాం లో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక అమ్మాయిని ఐదుగురు కలిపి టార్చర్ చేసిన వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.

ఇక ఈ వీడియో లో ఏముంది..?, అసలు ఏం జరిగింది..? అనేది చూస్తే.. ఈ వీడియో లో ఐదుగురు గుర్తు తెలియని మనుషులు ఒక అమ్మాయిని త్రోసి ఏడిపించడం.. టార్చర్ చెయ్యడం లాంటివి మనం చూడచ్చు.

అయితే సమయం మరియు ప్లేస్ గురించి ఎటువంటి సమాచారం తెలియదు. అస్సాం పోలీసులు ఈ ఐదుగురి వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. అయితే వీళ్ళని పట్టుకుంటే రివార్డ్ కూడా ఇస్తామని ప్రకటించారు. అస్సాం పోలీసులు ఐదుగురు నిందితుల చిత్రాలను విడుదల చేశారు.

ఎవరైనా సరే వీళ్ళని పట్టుకుంటే వాళ్లకి రివార్డ్ ఇస్తాం అని ప్రకటించడం కూడా జరిగింది. ఈ వీడియోలో ఆ ఐదుగురు వ్యక్తులు అమ్మాయిని కొడుతున్నట్లు, హింసిస్తున్నట్టు మనం చూడొచ్చు. పోలీసులు వీళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు కూడా మీడియా ద్వారా తెలుస్తోంది.