బిజేపిలోకే ఫైనల్ అని చెప్పేసిన ఈటెల… రేవంత్ ట్రై చేసినా పాపం…!

తెలంగాణాలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వ్యవహారం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అర్ధం కావడం లేదు. ఈటెల రాజేంద్ర విషయంలో ఇప్పుడు అధికార పార్టీ అనుసరిస్తున్న వైఖరి ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అయితే ఈటెల బిజెపిలో చేరడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈటల చేరికపై బీజేపీ హైకమాండ్ క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. బీజేపీ జాతీయ నేతలతో బండి సంజయ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో ఈటల రాజేందర్ అంశం బండి సంజయ్ ప్రస్తావించారు. ఈటలకు కాషాయ కండువా కప్పేందుకు త్వరలో ముహూర్తం ఖరారు చేసామని చెప్పారు. టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలను చేర్చుకోవాలని సూచించిన బీజేపీ జాతీయ నేతలు… తెలంగాణ ఉద్యమకారులును బీజేపీలో వైపు తిప్పుకోవాలని పేర్కొన్నారు. బీజేపీ హైకమాండ్ సమయం ఇవ్వగానే కాషాయ కండువా కప్పే అవకాశం ఉంది. అయితే ఈటెల కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసినా సరే ఫలితం లేకపోయింది.