రేపటి నుంచే ఫ్లిప్‌ కార్డు బిగ్ బచాత్ ధమాల్ సేల్‌.. లక్ష ప్రొడెక్టస్‌పై 80శాతం డిస్కౌంట్లు

-

ఆన్‌లైన్లో ఎప్పుడూ ఏదో ఒక ఆఫర్‌ నడుస్తుంది. అలాంటి ఆఫర్లలో ఉన్నవి తీసుకుంటే.. మన డబ్బు పొదుపు చేసుకోవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్‌ రేపటి నుంచి మరో భారీ సేల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇందులో వేటిపై డిస్కౌంట్లు ఉన్నాయో చూద్దామా..!

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ (Flipkart) కొన్ని రోజులుగా వరుస సేల్స్ తో వినియోగదారులపై నిత్యం ఆఫర్ల వర్షం కురిపిస్తూనే ఉంది. రేపు అంటే.. ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు మొత్తం 3 రోజుల పాటు బిగ్ బచాత్ ధమాల్ సేల్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో దాదాపు లక్షకు పైగా ఉత్పత్తులపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉంటాయని ప్రకటించింది.

ఈ సేల్ లో రియల్మీ, ఐఫోన్, పోకో, సాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. 4 in AC కన్వర్టబుల్ ఏసీలు రూ.26,499 ధరకు ప్రారంభం అవుతాయని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. టాప్-సెల్లింగ్ టీవీలు రూ.6999 ధరతో ప్రారంభం అవుతాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. క్లాత్, ఫ్యాషన్ ఐటెమ్స్‌పై 60-80 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. వాషింగ్ మిషన్లు కూడా 60 శాతం తగ్గింపుతో ఈ సేల్‌లో అందుబాటులో ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తన సేల్స్ పేజీలో పేర్కొంది. కస్టమర్లుకు ఈ సేల్‌లో రిఫ్రిజిరేటర్లు రూ.791 మంత్లీ ఈఎంఐ ఆఫర్లతో ప్రారంభం అవుతాయని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.

కిచెన్ అప్లియెన్సెస్‌పై భారీ డిస్కౌంట్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఇవే కాకుండా ఈ సేల్‌లో ఇతర వస్తువలపై భారీ బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉంటాయని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. AU Small Finance Bank, Bank Of Baroda, IDFC First Bank, Yes Bank కార్డులతో ఈ సేల్ లో షాపింగ్ చేస్తే అదనంగా పది శాతం డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version