షాపింగ్ లవర్స్​కు గుడ్ న్యూస్.. అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్​కార్ట్ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌’

-

వచ్చే నెలలో దసరా, దీపావళి.. ఇలా వరుసగా పండుగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో షాపింగ్ లవర్స్​కు ఫ్లిప్​కార్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఆఫర్లతో ఉక్కిరిబిక్కరి చేసేందుకు రెడీ అయింది. నిజండీ బాబూ.. అక్టోబర్‌ 8వ తేదీ నుంచి ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌’ నిర్వహించనుంది. అక్టోబర్‌ 15వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు ఈ సేల్‌ కొనసాగనున్నట్లు ఫ్లిప్​కార్ట్ నిర్వాహకులు తెలిపారు.

ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్​లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, యాక్సెసరీస్‌, గృహోపకరణాలు, ఫ్యాషన్‌, బ్యూటీ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉండబోతున్నాయి. ‘బిగ్గెస్ట్‌ ఈవెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పేరుతో ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇందులో మొబైల్‌ ఫోన్లపై భారీగా ఆఫర్లు ఉండనున్నాయి. ఎలక్ట్రానిక్స్‌, యాక్సెసరీస్‌లపై 50 నుంచి 80 శాతం, టీవీ, హోమ్ అప్లయెన్స్‌పై 80 శాతం, గృహాలంకరణ, బ్యూటీ, స్పోర్ట్స్‌, ఫ్యాషన్ ఉత్పత్తులపై 60 నుంచి 80 శాతం వరకు రాయితీలు ఉంటాయని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news