అయోధ్య రాముడికి హారతిచ్చే సమయంలో.. హెలికాప్టర్లతో పూల వర్షం

-

మరికొన్ని క్షణాల్లో అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ ఘట్టం మొదలైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12.20 గంటలకు మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం అయింది.. ఈ ఘట్టం ఒంటి గంట వరకు కొనసాగనుంది. అయితే బాలరాముడు కొలువుదీరిన తర్వాత ఈ అయోధ్య రాముడికి హారతి ఇవ్వనున్నారు.

అలా రామ్ లల్లాకు హారతి ఇచ్చే సమయంలో హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి. అదే సమయంలో 30 మంది సంగీత కళాకారులతో వివిధ వాద్యాలతో శ్రీరాముడి కీర్తనలు ఆలపించనున్నారు. ఇప్పటికే అయోధ్యకు వెళ్లే దారిలో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాల సాంప్రదాయ నృత్యాలు భక్తులకు ప్రత్యేక అనుభూతులను పంచాయి. రామాయణ ఘట్టాలను వివరిస్తూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మరోవైపు సినీ గాయకులు అయోధ్యకు చేరుకుని శ్రీరామ కీర్తనలు ఆలపించారు. ప్రముఖ ప్లేబాక్ సింగర్ సోనూ నిగమ్, శంకర్ మహదేవన్, అనురాధ వంటి గేయకారులు శ్రీరఘుకులోత్తముడి కీర్తనలను పాడారు.

Read more RELATED
Recommended to you

Latest news