చ‌త్తీస్‌ఘ‌ఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్ తండ్రి క‌న్నుమూత‌

-

చ‌త్తీస్‌ఘ‌ఢ్ మాజీ సీఎం, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత భూపేష్ బాఘేల్ తండ్రి నంద్ కుమార్ బాఘేల్ సోమ‌వారం ఉద‌యం మ‌ర‌ణించారు. ఈ ఉద‌యం బాబూజీ శ్రీ నంద్ కుమార్ బాఘేల్ తుదిశ్వాస విడిచార‌ని తెలిపేందుకు విచారిస్తున్నామ‌ని భూపేష్ బాఘేల్ సోష‌ల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

నంద్ కుమార్ బాఘేల్ భౌతిక కాయాన్ని ప్ర‌స్తుతం పత‌న్ స‌ద‌న్‌లో ఉంచారు. సోద‌రి విదేశాల నంచి తిరిగిరాగానే ఈనెల 10న త‌మ స్వ‌గ్రామం కురుద్ధిహ్‌లోఅంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డించారు. బాఘేల్ తండ్రి మ‌ర‌ణం ప‌ట్ల చ‌త్తీస్‌ఘ‌ఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ప్ర‌గాఢ సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నామ‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news