నాలుగో విడత లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

-

సార్వత్రిక ఎన్నికల నాలుగో దశకు ఇవాళ నోటిఫికేషన్‌ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

ఈనెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి.. 26న పరిశీలించనున్నారు. 29వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. నాలుగో విడతలో లోక్‌సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బిహార్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జమ్మూకశ్మీర్‌ ఉన్నాయి. వీటిలో మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ అభ్యర్థి రూ.25 వేలు, శాసనసభ అభ్యర్థి రూ.10 వేలు ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50% చెల్లిస్తే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news