కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు ఆందోళనలో పాల్గొన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తోంది. దేశంలో రైతులకు కనీసం మద్దతు ధర దక్కడం లేదు. మోడీ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేసి దేశాన్ని దివాలా చేసేపనిలో మోడీ ప్రభుత్వం ఉంది. కార్పొరేట్ కంపెనీలకు సానుకూలంగా ఉన్న ఈ బడ్జెట్ను దేశ ప్రజలు, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పాలన పక్కన పెట్టి సన్యాసులవలే తిరుగుతూ వుండకుడదు.
ప్రజలు పరిపాన చెయ్యమని మెజారిటీతో గెలిపించి అదికారాన్ని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తన పార్టీ అజెండా పక్కనపెట్టి బిజెపి అజెండా నెత్తిన పెట్టుకొని సనాతన వాదంతో తిరుగుతున్నాడు. సనాతన అజెండా పవన్ కళ్యాణ్ తన పార్టీలో ఎప్పుడు పెట్టాడో చెప్పాలి. పవన్ కళ్యాణ్ కుటుంబం సభ్యులు అందరూ క్రిస్టియన్స్ తన పిల్లలు క్రిస్టియన్స్ ,,మరి హిందూ మత వాదాలతో తిరుగుతు సనాతన వాదం జెండా నాది అంటే ప్రజలు హర్షించరు. సనాతన వాదంతో దేశం ఎప్పుడు ముందుకెళ్లదు పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని తెలుసుకోవాలి అని రామకృష్ణ సూచించారు.