G20 నిర్వహణ అద్భుతం.. భారత్​పై ప్రపంచ నేతల ప్రశంసలు

-

భారత్ వేదికగా తొలిసారిగా దిల్లీలో 18వ జీ20 శిఖరాగ్ర సదస్సు అట్టహాసంగా జరిగింది. ఈ సదస్సు నిర్వహణపై జీ-20 దేశాలన్నీ సంతృప్తి వ్యక్తం చేశాయి. ఉక్రెయిన్‌ అంశంపై భిన్న వైఖరులు కలిగి ఉన్న అమెరికా, రష్యా కూడా సదస్సు నిర్వహణ అద్భుతంగా జరిగిందని తెలిపాయి. జీ20లోని ప్రధాన థీమ్ అయిన ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుకు.. ఈ భాగస్వామ్యం కట్టుబడి ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అన్నారు.

G20కి అధ్యక్షత వహించిన భారత్‌.. ప్రపంచ ఐక్యత కోసం తనవంతు కృషి చేసిందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ అన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. భారత దేశం తన సూత్రాలకు కట్టుబడి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ సమయంలో శాంతి సందేశాలు అందించేందుకు ప్రయత్నించిందని మేక్రాన్ అన్నారు.

మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రతినిధిగా వచ్చిన ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌.. భారత్‌ అధ్యక్షతను కొనియాడారు. చరిత్రలో తొలిసారి G20 దేశాలను భారత్‌ నేతృత్వం నిజంగా ఏకీకృతం చేసిందని ప్రశంసించారు. డిక్లరేషన్‌లో రష్యా-ఉక్రెయన్‌ పేరాగ్రాఫ్‌ను మిగిలిన భాగం నుంచి విడదీయలేమని అన్నారు. దీనికి పశ్చిమదేశాలు అంగీరిస్తాయని ఊహించలేదని అన్నారు. భారత్‌ అధ్యక్షతన అన్ని దేశాలు సంయుక్త ప్రకటనను అంగీకరించడమనేది.. నిజంగా అర్థవంతమైన విజయమని జపాన్‌ ప్రధాని పుమియో కిషిద అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news