65 లక్షల కరెన్సీ నోట్లతో గణేష్ మండపం అలంకరణ

-

దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఒక్కొక్క ఆలయంలో ఒక్కో రూపంలో వినాయకుడు దర్శనమిస్తున్నారు. ఇప్పటికే పలు ఆలయాలలో వినాయకుడి విగ్రహంను ప్రతిష్టించారు. మామూలుగా వినాయకుడి మండపాల్లో పూలు, పండ్లతో ప్రత్యేక అలంకరణ చేస్తే కర్ణాటకలోని ఓ ఆలయంలో మాత్రం కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కర్ణాటకలోని బెంగళూరులో శ్రీ సత్య గణపతి ఆలయంలో గణేషుడి నవరాత్రులను నిత్యనూతనంగా నిర్వహిస్తుంటారు. ప్రతీ సంవత్సరం కొత్తదనాన్ని చూపించే నిర్వాహకులు ఈ ఏడాది తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఆలయాన్ని వందలకొద్ది నాణెలు, కరెన్సీ నోట్లతో అలంకరించారు. వాటి విలువ రూ.65లక్షలు ఉంటుంది. అందులో రూ.10 నుంచి రూ.500 వరకు నోట్లున్నాయి. రకరకాల ఆకృతుల్లో ఆలయాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇక్కడి వినాయకుడు చాలా ప్రత్యేకమనే చెప్పాలి.

గత కొద్ది సంవత్సరాలుగా గణేష్ నవరాత్రులకు ఆలయాన్ని పర్యావరణ హితంగా అలంకరిస్తూ.. వస్తున్నారు. పూలు, మొక్కజొన్న, అరటికాయలు, రకరకాల పండ్లను ఉపయోగిస్తున్నారు. ఈసారి అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఆలయ అలంకరణకు కరెన్సీ నోట్లను వినియోగించడం విశేషంగా చెప్పవచ్చు. ఎప్పటిమాదిరిగా ఏడాది కూడా భారీ లడ్డును వేలానికి పెట్టారు. కరెన్సీ నోట్ల అలంకరణను చూడటానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నారు. ఈ ప్రాంతమంతా సందర్శకులతో సందడిగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version