ఇకపై వాట్సప్‌లో యాడ్స్‌ వస్తాయా..? కంపెనీ ఏం అంటుందంటే

-

ఆన్‌లైన్‌లో ఏదైనా కంటెంట్‌ చూస్తుంటే యాడ్స్‌ రావడం చాలా సాధరణమైన విషయం.. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, యూట్యూబ్‌ ఆఖరికి బ్రౌసింగ్‌ చేసేప్పుడు కూడా ఏదో ఒక ప్రకటనలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు వీటివల్ల చాలా చిరాకుగా ఉంటుంది. కానీ వాట్సప్‌లో ఈ సమస్య ఉండదు. ఇతరుల స్టేటస్‌లో ఇక్కడ యాడ్స్‌మాదిరి.. నచ్చకుంటే వాటిని ఎలాగూ మ్యూట్‌ చేస్తాం అనుకోండి. కానీ ఇక నుంచి వాట్సప్‌లో కూడా యాడ్స్‌ రానున్నాయనే వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుోతంది. చాట్‌ స్క్రీన్‌పై యాడ్స్‌ తీసుకురావటంపై వాట్సాప్‌ యోచిస్తున్నట్లు కొన్ని పత్రికల్లో వార్తలు బయటకు వచ్చాయి. ఆదాయాన్ని పెంచుకోవటంలో భాగంగానే ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తోందట. కానీ దీనిపై వాట్సప్‌ స్పందిస్తూ వేరేలా చెప్పింది..

వాట్సప్‌లో యాడ్స్‌

‘వాట్సాప్ చాట్‌ స్క్రీన్‌పై ప్రకటనలు చూపించాలా? వద్దా? అనే అంశంపై మెటా సభ్యులు చర్చిస్తున్నారు. అయితే తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. దీంతో పాటూ యాడ్‌-ఫ్రీ యాప్‌ను ఉపయోగించటానికి మెటా సబ్‌స్క్రిప్షన్‌ డబ్బులు వసూలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. దీనిపై వాట్సాప్‌ హెడ్‌ విల్‌ క్యాథ్‌కార్ట్‌ స్పందిస్తూ…‘వాట్సాప్‌ యాడ్స్‌పై వచ్చిన కథనాలు అవాస్తవం. మేము అలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అంటూ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. అలాగే వాట్సాప్‌పై వస్తున్న ఈ వాదనలన్నీ అవాస్తవం అన్నారు.

వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. బ్రాడ్‌కాస్ట్‌ తరహాలో వాట్సాప్‌ ఛానెల్స్‌ (WhatsApp Channels) సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇది వన్‌వే ఛానెల్‌ లాంటిది. దీంతో ఒకే సారి పెద్ద సంఖ్యలో సందేశాలు పంపిచొచ్చు. ఇది సాధారణ చాట్‌ కంటే కాస్త మెరుగైనది. మీరు కోరుకున్న వ్యక్తులు, సంస్థల నుంచి కావాల్సిన అప్‌డేట్‌లను ఈ ఛానెల్స్‌ ద్వారా తీసుకోవచ్చు. ఇలా ఫాలో అయ్యే వారి వివరాలు ఇతర ఫాలోవర్స్‌కు తెలియవు. అంటే అచ్చం బ్రాడ్‌కాస్ట్‌ టూల్‌లా ఇది పనిచేస్తుంది.

ఏది ఏమైనా నిప్పు లేనిదే పొగ రాదు అని సామెత మీకు తెలిసే ఉంటుంది. ఈ వార్తలో ఎంతో కొంత నిజం ఉంటుందని.. కొందరు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version