లాలూ సూచనతో 60 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడైన గ్యాంగ్‌స్టర్‌

-

అతడో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌. ఓ హత్య కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాదే విడుదలయ్యాడు. ప్రస్తుతం 60 ఏళ్ల వయసున్న అతను మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి ఏదో క్రైమ్ చేసి కాదండోయ్. పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. ఈ గ్యాంగ్స్టర్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. చట్టపరంగా సాధ్యం కాకపోవడంతో పెళ్లి చేసుకుని భార్యను నిలబెట్టాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సలహా ఇవ్వడంతో ఓ మహిళను అతడు వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్యను ఆర్జేడీ తరఫున ఎన్నికల బరిలోకి దింపబోతున్నాడు.

నవాదా జిల్లాలోని కోనన్‌పుర్‌ గ్రామానికి చెందిన అశోక్‌ మహతో అనే గ్యాంగ్‌స్టర్‌ షేక్‌పురా జేడీయూ ఎమ్మెల్యే రణధీర్‌ కుమార్‌ సోనీపై హత్యాయత్నం ఆరోపణలతోపాటు నవాదా జైలు బద్దలుగొట్టిన కేసులో నేరస్థుడిగా 17ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2023లో జైలు నుంచి విడుదలైన అశోక్ లాలూ సూచనతో పట్నా భక్తియార్‌పుర్‌లోని కరౌటా జగదాంబ ఆలయంలో ఓ మహిళను మంగళవారం రాత్రి వివాహం చేసుకున్నాడు. ఇక తన భార్యను ముంగేర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా అశోక్‌ మహతో పోటీలోకి దింపబోతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news