కాంగ్రెస్​పై ఆజాద్ విమర్శలు.. చేతగానివాళ్లలా ఉంటేనే ఆ పార్టీలో చోటంటూ…

-

కాంగ్రెస్​ పార్టీ నుంచి వీడిపోయిన ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుత డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్యక్షుడు హస్తం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీలో చేతగానివాళ్లకే చోటు ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో సహా మరికొందరు సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీని వీడటానికి రాహుల్‌ గాంధీయే ముఖ్య కారణమని అన్నారు. తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరుకున్నప్పటికీ వారి చేతిలో ఏమీలేదని అన్నారు.

 

“ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీ పనిచేసిన దాంట్లో 1/50 పని చేసినా రాహుల్​ సక్సెస్​ అయ్యేవారు. రాజకీయాలంటే.. మొదట పార్టీ, ప్రజలు, దేశం పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. 2013లో కాంగ్రెస్​ పార్టీ తెచ్చిన ఆర్డినెన్స్​ను చింపేయకుండా ఉంటే.. ఈరోజు రాహుల్​ గాంధీ అనర్హత నుంచి బయటపడేవారు. అయితే, అప్పడు ఉన్నది బలహీనమైన క్యాబినెట్​. రాహుల్​ గాంధీ తిరస్కరించినా.. ఆ చట్టాన్ని తీసుకురావాల్సింది. అప్పుడు కాంగ్రెస్​ పార్టీ తప్పు చేసింది. ఆ సమయంలో నేను ఏం మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. ” -గులాం నబీ ఆజాద్‌, డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ ఆజాద్‌ పార్టీ అధ్యక్షుడు

Read more RELATED
Recommended to you

Latest news