భలే రైలు గురూ.. 90 నిమిషాలు ముందే వచ్చి.. 45 మందిని వదిలేసింది

-

మీరు ఎక్కాల్సిన రైలు జీవితకాలం ఆలస్యం అనే సామెత తెలిసిందే. చాలా వరకు రైళ్లు ఆలస్యంగానే వస్తాయి. కారణాలేవైనా రైళ్లు ఆలస్యంగా రావడం మాత్రం కామన్. కానీ వాస్కోడిగామా- హజ్రత్‌ నిజాముద్దీన్‌ గోవా ఎక్స్‌ప్రెస్‌ మాత్రం 90 నిమిషాలు ముందుగానే వచ్చింది. దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. ఏకంగా 45 మంది ప్రయాణికులను ఎక్కించుకోకుండా వదిలేసి వెళ్లింది గోవా ఎక్స్​ప్రెస్.

గురువారం ఉదయం  10.35 గంటలకు ఈ రైలు మహారాష్ట్రలోని మన్మాడ్‌ జంక్షన్‌కు రావాల్సి ఉండగా మళ్లింపు మార్గంలో 9.05కే వచ్చేసింది. అప్పటికి ఇంకా ఆ స్టేషన్‌కు చేరుకోవాల్సినవారు ఉన్నా ఐదు నిమిషాల్లోనే అక్కడి నుంచి బయల్దేరి వెళ్లిపోయింది. ఆ స్టేషన్లో 45 మంది ఆ రైలును అందుకోవాల్సి ఉంది. 9.45-10 గంటల సమయంలో స్టేషన్‌కు వచ్చిన ఆ ప్రయాణికులు అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ స్టేషన్‌ మేనేజర్‌ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అధికారులు వీరి కోసం గీతాంజలి ఎక్స్‌ప్రెస్‌ను మన్మాడ్‌లో నిలుపుచేయించి, దానిలో జల్గావ్‌కు పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news