ఎన్నికలు వస్తున్నాయంటే చాలు..ఇప్పటివరకు కంటికి కనిపించిన నేతలు కూడా కనిపిస్తారు. అనూహ్యంగా నియోజకవర్గాల్లో యాక్టివ్ గా తీరగుతారు. ప్రజల మద్ధతు పొందడానికి ప్రయత్నిస్తారు. అలాగే సీటు దక్కించుకోవాలని చూస్తారు. ఇలా ఎన్నికల సమయంలోనే సీట్ల కోసం నేతల మధ్య పోటీ నెలకొంటుంది. మామూలుగా రాజకీయంగా అధికార, విపక్షాల మధ్య పోరు ఉంటుంది. కానీ ఎన్నికల సమయంలో మొదట ఒకే పార్టీ లో సీట్ల కోసం పోటీ ఉంటుంది.
ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతుంది. మరో మూడు,నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్నీ పార్టీల్లో సీట్ల కోసం పోటీ నెలకొంది. బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజేపి…ఇలా మూడు పార్టీల్లో నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్ లోనే సీటు కోసం పోటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ రెండు పార్టీలకే బలం ఎక్కువ ఉంది కాబట్టి. సీటు దక్కించుకుంటే గెలుపు ఈజీ అని భావిస్తున్నారు. ఇక సీటు దక్కకపోతే నేతలు ఒక పార్టీలో నుంచి మరొక పార్టీలోకి జంప్ అవ్వడానికి చూస్తున్నారు.
అయితే అధికార బిఆర్‌ఎస్ లో సీటు కోసం కుమ్ములాటలు ఎక్కువగా జరుగుతున్నాయి. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌కు పోటీగా సీనియర్ నేతలు చందర్‌రావు, కె.శశిధర్ రెడ్డి ఉన్నారు. తాండూరులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య సీటు కోసం ఫైట్ నడుస్తుంది. అటు మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డిల మధ్య పోరు ఉంది. ఇలా ఒక చోట ఏంటి..దాదాపు 50 పైనే స్థానాల్లో సీటు కోసం పోటీ నెలకొంది.
ఇందులో ఎవరైకైనా సీటు దక్కకపోతే వారు కాంగ్రెస్ లోకి జంప్ అవ్వడానికి చూస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా చర్చలు కూడా చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ లో కూడా అదే పరిస్తితి ఉంది. దీటు దక్కని నేతలు బిఆర్‌ఎస్ లేదా బిజేపిలోకి వెళ్లాలని చూస్తున్నారు. ఇక బిజేపిలో కూడా బలంగా ఉన్న సీట్లలో పోటీ ఉంది. ఇలా మూడు పార్టీల్లో ఎన్నికల కుమ్ములాటలు సాగుతున్నాయి.