ఈనెల 9 వరకు గోఫస్ట్‌ విమాన సర్వీసులు రద్దు

-

ప్రముఖ విమానయాన సంస్థ గోఫస్ట్‌ ఈనెల 9 వరకు సర్వీసులను రద్దు చేసింది. తొలుత 3, 4, 5 తేదీల్లో సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంస్థ గురువారం ఈ మేరకు వెల్లడించింది. ఆర్థిక కష్టాల వల్ల నిర్వహణ కారణాలతోనే సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ తేదీల్లో ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి పూర్తి టికెట్‌ సొమ్మును వాపసు చేయనున్నట్లు వెల్లడించింది.

మే 15 వరకు కొత్తగా టికెట్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు డీజీసీఏకు వెల్లడించింది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమాపణలు చెప్పింది. త్వరలోనే టికెట్ల విక్రయాలు మళ్లీ ప్రారంభిస్తామని ఆశా భావం వ్యక్తం చేసింది గో ఫస్ట్ విమానయాన సంస్థ.

రద్దు చేస్తున్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ తేదీల్లో ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి పూర్తి టికెట్‌ సొమ్మును వాపసు చేయనున్నట్లు వెల్లడించింది. మే 15 వరకు కొత్తగా టికెట్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు డీజీసీఏకు వెల్లడించింది

Read more RELATED
Recommended to you

Latest news