బంగారం ధరలు ( Gold Price ), వెండి ధరలు భారీగా తగ్గాయి. ఓసారి బంగారం ధరలు చూస్తుంటే ఈ వారం ఇలానే తగ్గే సూచనలు ఉన్నాయి. గోల్డ్ పెట్టుబడులు చాలా మంది వెనక్కి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి బంగారం ధరల్లో పెరుగుదల ఉంది. ఇప్పుడు మాత్రం తగ్గుతున్న ట్రెండ్ మూడు రోజుల నుంచి కనిపిస్తోంది. తాజా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారట్ల బంగారం ధర 1 గ్రాము రూ.4,385 ఉంది. 10 గ్రాములు కావాలంటే దాని ధర రూ.43,850 ఉంది. నిన్న 10 గ్రాములు ధర రూ.750 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (బులియన్ మార్కెట్ ప్రారంభ సమయానికి ముందు) 1 గ్రాము రూ.4,784 ఉంది. 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,840. నిన్న 10 గ్రాములు ధర రూ.820 తగ్గింది.
- హైదరాబాద్ 22 క్యారెట్లు రూ.43,850
- విజయవాడ 22 క్యారెట్లు రూ.43,850
- విశాఖపట్నం 22 క్యారెట్లు రూ.46,000.
- బెంగళూరు 22 క్యారెట్లు రూ.43,850
- చెన్నై 22 క్యారెట్లు రూ.44,400
- ఢిల్లీలో 22 క్యారెట్లు రూ.46,000
- కోల్‌కతాలో 22 క్యారెట్లు రూ.46,350
- ముంబైలో 22 క్యారెట్లు రూ.45,700
వెండి ధర నిన్న భారీగా తగ్గింది. ఈ ఉదయానికి వెండి ధర 1 గ్రాము రూ.70.20 ఉంది. కేజీ వెండి ధర… రూ.70,200 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.1,500 తగ్గింది. 7/ 7 స్టాక్ మార్కెట్లు: భారత స్టాక్ మార్కెట్లలో సోమవారం నుంచి మరికాస్త జోష్ కనిపించే అవకాశాలు ఉన్నా… లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.