వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్.. హిందీ, తెలుగు మీడియాల్లో విద్య : ప్రధాని మోడీ

-

భారతదేశంలో ప్రస్తుతం నీట్ పరీక్ష కేవలం ఇంగ్లీషు మీడియంలోనే ఉండటంతో కొంత మంది విద్యార్థులు చదవలేకపోతున్నారు. కేవలం ఇంగ్లీషు మీద పట్టు ఉన్న విద్యార్థులు మాత్రమే వైద్య విద్య పై శ్రద్ధ పెడుతున్నారు. అయితే అలాంటి వారికి తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. అతి త్వరలో హిందీ సహా ఇతర భారతీయ భాషల్లో కూడా వైద్య విద్యను అందించాలని నిర్ణయించామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

దీంతో దళితులు, గిరిజనులు, ఓబీసీలకు చాలా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో మరో 75వేల మెడికల్ సీట్లు పెంచుతామని హామీ ఇచ్చారు. దేశంలో ఎయిమ్స్ ఆసుపత్రులను 24 కు పెంచామని గుర్తు చేశారు. బీహార్ లో రూ.12000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రసంగంలో  వైద్య విద్య పై ప్రస్తావించారు. బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచిస్తుందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో దేశంలో క్యాన్సర్ కి సంబంధించిన ఆసుపత్రుల్లో కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news