ఢిల్లీలో పొల్యూషన్ ను నివారించేందుకు ప్రభుత్వం యాక్షన్ ప్లాన్..!

-

సాధారణంగా ఢిల్లీలో పొల్యూషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసాల్లో అయితే పొల్యూషన్ విపరీతంగా ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం ఢిల్లీ పొల్యూషన్ గురించి వింటుంటాం. ఈ పొల్యుషన్ ని నివారించేందుకు తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీంతో పొల్యూషన్ లేకుంటే ఢిల్లీ రూపురేఖలు మారుతాయని భావిస్తోంది సర్కార్.

ఢిల్లీలో పొల్యూషన్ ను నివారించేందుకు యాక్షన్ ప్లాన్ ను ప్రకటించింది అతిషి ప్రభుత్వం. దాదాపు 21-పాయింట్లతో శీతాకాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది ఢిల్లి సర్కార్. వాతావరణం ప్రతికూలంగా మారినప్పుడు కాలుష్యం తగ్గించడానికి శీతాకాల కార్యాచరణను రూపొందించింది. ముఖ్యంగా అక్టోబర్ 7 నుంచి నవంబర్ 7 వరకు ఢిల్లీలో దుమ్ముకు వ్యతిరేఖంగా ప్రచారం చేయనున్నారు. కాలుష్య నివారణ కోసం రంగంలోకి 523 బృందాలు పని చేయనున్నట్టు సమాచారం. అతిషి నేతృత్వంలో కీలక నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమనే చెప్పాలి. 

Read more RELATED
Recommended to you

Latest news