ప్రజల కోసమే మూసీ అభివృద్ది అని హైడ్రా అధికారి దాన కిషోర్ పేర్కొన్నారు. తాజాగా హైడ్రా ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా దాన కిషోర్ మాట్లాడుతూ.. గతంలో వరదలతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. గతంలో మూసీ నదికి భారీ వరదలు వచ్చాయి. మూసీ ప్రాజెక్ట్ లో ప్రభుత్వం ఉద్దేశం ఏంటి..? 20 నిమిషాల్లో భారీ వరద వచ్చింది. 9.1 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. చిన్న వర్షానికే సచివాలయం ముందు వరద పోటెత్తింది.
భారీ వర్షపాతం నమోదైతే అధికారులు కూడా ఏం చేయలేరని తెలిపారు దాన కిషోర్. మూసీని బ్యూటిఫికేషన్ చేయడం కోసం ఈ చర్యలు తీసుకోవడం లేదు. గతంలోనూ నిర్వాసితులను తరలించారు. గత వరదలతో భారీ ప్రాణ నష్టం జరిగింది. గతంలో మూసీ సుందరానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలు చేశారని తెలిపారు. మూసీ వరదల వల్ల బాధపడేది ప్రజలే. ప్రజల కోసమే మూసీ అభివృద్ది అని దాన కిషోర్ తెలిపారు.