అక్కడికి పోకుండానే.. ఆ విషయంలో జగన్ సక్సెస్ అయ్యారా…? టీడీపీలో జరుగుతున్న టాక్..

-

కూటమి ప్రభుత్వం అదికారంలోని వచ్చి వందరోజులు పూర్తయింది.. ఈ వందల రోజుల పాలన గురించి ఆ పార్టీ కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తోంది.. ఇదే సమయంలో వెంకటేశ్వరస్వామి లడ్డూ మీద కామెంట్స్ చేసి.. అన్ని వర్గాల ప్రజల దృష్టిని దానిమీదకు మళ్లేలా చంద్రబాబునాయుడు చేశారు.. అందులో బాబు సక్సెస్ అయ్యారు.. ఏ ఇద్దరూ గుమిగూడినా.. లడ్డూ టాపిక్ గురించే మాట్లాడుకుంటున్నారు.. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చలు జరుగుతున్నాయి.. అయితే తిరుమల పర్యటన రద్దుమీద టీడీపీలో లోతైన డిస్కర్షన్ జరుగుతోంది..

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను ఖరారు చేసినప్పటి నుంచి ఓవర్గం ఆయన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చింది.. కొండమీద డిక్లేరేషన్ ఇవ్వాలని పట్టుబట్టింది..దీనికి సీఎం చంద్రబాబుతోపాటు.. లోకేష్, పురందేశ్వరీలు కూడా మాటలు కలిపారు..దీంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది.. లడ్డూ వ్యవహారంలో జగన్ తిరుమలకు వస్తే అడ్డుకుంటామని.. బిజేపీతో పాటు.. హిందూ సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. కానీ జగన్ మాత్రం వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని పట్టుబట్టారు.. ఈ సమయంలో దర్శనానికి అనుమతులు లేవంటూ వైసీపీ నేతల్ని హౌస్ అరెస్టులు చేసిన నేపథ్యంలో.. జగన్ మీద దాడి జరిగే ప్రమాదముందని.. వైసీపీ నేతలు ఆరోపించారు..

జగన్ మీద భౌతిక దాడికి యత్నిస్తున్నారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో.. ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు.. ఈ వ్యవహారంలో తాము పై చేయి సాధించామని కూటమి నేతలు చెబుతున్నా.. ఇంటర్నల్ గా టీడీపీలో ఓ చర్చ నడుస్తోంది.. లడ్డూ విషయంలో తాము చేసిన ఆరోపణలు నిజంకాదని.. ల్యాబ్ రిపోర్టుతోపాటు.. భక్తులు కూడా నమ్ముతున్నారు.. ఈ సమయంలో వైసీపీ చేసిన కామెంట్స్ ను జనాలు నమ్మే పరిస్థితి ఏర్పడింది.. ఈ సమయంలో జగన్ తిరుమల పర్యటననుఅడ్డుకుంటే మైలేజ్ పొందని టీడీపీ భావించింది.. కానీ ఇక్కడే ఆ పార్టీ బోల్తా కొట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

డిక్లరేషన్ పేరుతో జగన్మోహన్ రెడ్డిని తిరుమలకి రాకుండా.. ప్రభుత్వం అడ్డుకుందని ఓ వర్గంలో బలంగా నాటుకుపోయింది.. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఈ నాటకం సాగిందని.. ప్రజల్లో ఓ చర్చ నడుస్తోంది.. ఒక భక్తునిగా తనను తిరుమలకు వెళ్లనివ్వలేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు జనాల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి.. పోకుండానే..వైసీపీ లడ్డూవ్యవహారంలో మైలేజ్ సంపాదించుకున్నది టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.. జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లికి పరిమితం చెయ్యకుండా.. తిరుమలకు వెళ్లనిచ్చి ఉంటే.. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూల దృక్పథం ఉండేందని.. సీనియర్ నేతలు మాట్లాడుకుంటున్నారు.. జగన్ మీద పైచేయి సాధించామని.. తమ పార్టీ భావిస్తోందని.. కానీ తిరుమల పర్యటన రద్దు జగన్ ను ఫేవర్ గామారిందని స్వంత పార్టీనేతలు గుసగుసలాడుకుంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news