దిల్లీ మెట్రో రైళ్లలో కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ రాతలు

-

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ మెట్రో రైళ్లలో రాతలు (గ్రాఫిటీ) వెలశాయి. ఈ నేపథ్యంలో ఆప్‌ స్పందిస్తూ.. కేజ్రీవాల్పై బెదిరింపుల వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించింది. దిల్లీలోని మెట్రో రైళ్లలో కేజ్రీవాల్‌ ఈ అంశంపై చర్చించేందుకు తమకు సమయం కేటాయించాలంటూ ఎన్నికల కమిషన్‌కు ఈ-మెయిల్‌ ద్వారా విజ్ఞప్తి చేసింది. బెదిరింపుల విషయాన్ని తాము పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేపట్టామని అధికారి వెల్లడించారు.

దిల్లీలోని మొత్తం ఏడు ఎంపీ స్థానాల్లోనూ ఓడిపోతున్నామని అర్థమైన బీజేపీ తీవ్ర ఆందోళనకు గురై కేజ్రీవాల్‌ లక్ష్యంగా పలు రకాలుగా కుట్రలు పన్నుతోందని దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని, తిహాడ్‌ జైల్లో పెట్టాక 15 రోజుల పాటు ఆయనకు ఇన్సులిన్‌ ఇవ్వలేదని మండిపడ్డారు. జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని స్వాతి మాలీవాల్‌పై దాడి కేసును ప్రయోగించారని ఆరోపించారు. బయటకు వచ్చిన వీడియోలు ఆమె చేసిన ఆరోపణలు అవాస్తవమని తేల్చడంతో ఆ కుట్ర విఫలమైందని అతిశీ అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని అతిశీ ఆందోళన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news