తెలంగాణ రైతులకు షాక్..రాబోయే ఖరీఫ్ పంటకు కూడా రైతు భరోసా లేనట్లేనని మంత్రి శ్రీధర్ బాబు చెప్పకనే చెప్పారు. ఎకరానికి రూ. 15 వేలు రైతు భరోసా కింద ఇవ్వాలంటే విధివిధానాలు, నిబంధనలు ఖరారు కాలేదు ఖరీఫ్ (వానా కాలం) పంట అయిపోయిన తరువాత చూద్దామని పేర్కొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దీంతో రాబోయే ఖరీఫ్ పంటకు కూడా రైతు భరోసా లేనట్లేనని తేలిపోయింది.
అటు వ్యవసాయం, విద్య, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయాలని మా ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు శ్రీధర్ బాబు. ధాన్య సేకరణ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని.. ధాన్యం కొనుగోలు విషయంలో ఒక్క గింజ తరుగు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తాం….ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎక్కువ సేపు వేచి ఉండకుండా త్వరగా కొనుగోలు చేస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం విస్మరించిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందని వెల్లడించారు. విద్య పై క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించిందని వివరించారు.