గుజరాత్ ప్రభుత్వం: డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్చాలి..!

-

మంగళవారం (జనవరి 19) హార్టికల్చర్ డెవలప్‌మెంట్ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం విజయరూపాని మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అసలు డ్రాగన్ ఫ్రూట్ పేరు ఎందుకు మార్చాలి..? ఈ విషయం లోకి వస్తే.. డ్రాగన్ ఫ్రూట్ పేరును ‘కమలం’ పండుగా నిర్ణయించింది. ఈ విషయం పై సీఎం విజయ్ రూపానీ మాట్లాడుతూ.. దీనికి సంబంధించి ఇప్పటికే పేటెంట్ మార్పునకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. డ్రాగన్ అనే పేరు వినసొంపుగా లేదు అందుకే దీనిని ‘కమలం’ పండు అని పిలవాలని అన్నారు.

కమలం అని పిలవాలంటూ పేటెంట్‌కు ప్రతిపాదనలు చేశామని కూడా ఈయన తెలిపారు. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం దీన్ని కమలం పండుగా పిలవాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అలానే ఈ పేరు వెనుక వెనుక ఎటువంటి రాజకీయ కోణం లేదని చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్ పేరును బీజేపీ గుర్తు ‘కమలం’ పేరును ప్రతిపాదించినట్లుగా అనుకోవద్దని చెప్పడం కూడా జరిగింది. రాజకీయ కోణంలో ఏ మాత్రం ఆలోచించ వద్దు అని సూచించారు.

ఇది ఇలా ఉండగా చైనాను డ్రాగన్ దేశం అని పిలుస్తారనే విషయం తెలిసిందే. ఈక్రమం లో చైనా పేరు తో ఉండే డ్రాగన్ ఫ్రూట్ ను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని వార్తలు వస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. గుజరాత్ లోని కచ్ జిల్లాలో రైతులు ఈ డ్రాగన్ ఫ్రూట్ ను దాదాపు 1000 హెక్టార్లలో పండిస్తారు. గుజరాత్ లో పాలనలో ఉండే ‘కమలం’ గుర్తు పేరును అనుకుంటున్నారు కానీ అలా అనుకోవద్దని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news