పాపం నక్షత్ర తాబేళ్లని స్వేచ్ఛగా జీవించనివ్వండి…!

-

ఎక్కువగా మనకు తాబేళ్లు చెరువుల్లో, సరసుల్లో, ఆలయాల్లో కనపడుతుంటాయి. చాల మంది ఇళ్ళలో కూడా వీటిని పెంచుకుంటారు. అయితే ఇవన్నీ సాధారణ తాబేళ్లు. వీటి గురించి అందరికీ సుపరిచితమే కానీ నక్షత్ర తాబేళ్ల గురించి విని ఉండరు. ఇవి మనకి చాల అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. వీటి గురించి మీరు చాల విషయాలు తెలుసుకోవాలి. మరి పూర్తిగా ఇప్పుడే తెలుసుకోండి. పూర్తి వివరాల్లోకి వెళితే… అరుదుగా కనిపించే ఈ నక్షత్ర తాబేళ్ళని అదృష్టంగా భావిస్తారు. దేవాలయాలు, అడవుల్లోనూ ఉండాల్సిన ఈ తాబేళ్ళని ఇప్పుడు మన దేశం నుంచి విదేశాలకు పంపిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే..?

తాబేళ్లను దళారులు అక్రమంగా రవాణా చేసి లక్షలాది రూపాయలను పొందాలనే. ఎక్కువగా ఈ తాబేళ్లు ఆకురాల్చే అడవుల్లో పెరుగుతాయి. ఇది ఇలా ఉండగా దళారులు అక్రమంగా రవాణా చేయడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… ఇళ్లలో పెంచుకుంటే సిరిసంపదలు కలుగుతాయని వారి నమ్మకం. ఈ సెంటిమెంట్ ఉత్తరాది రాష్ట్రాల్లో మరీ ఎక్కువ. ఈ నక్షత్ర తాబేళ్లకు చైనా, థాయిలాండ్ లాంటి దేశాల్లో భారీ డిమాండ్ ఉంది. ఎవరైనా ఇంటికి వెళ్లిన, శుభకార్యాలకు వెళ్లినా నక్షత్ర తాబేలును కానుకగా ఇస్తారు. అందుకే వీటిని మన దేశం నుంచి ఇతర దేశాలకి తరలిస్తున్నారు. దీనితో రూ.50వేల వరకు విక్రయిస్తున్నారట.

ఇతర దేశాల్లో వీటి ధర లక్షల రూపాయల దాక పలుకుతున్నాయి. అందుకే వీటిని అక్కడికి తరలిస్తున్నారు. కానీ వీటిని అక్రమ రవాణా చేస్తే 1972 వన్యప్రాణి సంరక్షణ విభాగం చట్టం ప్రకారం ఏడు సంవత్సరాల జైలుశిక్ష అని చెబుతున్నారు అధికారులు. సెంటిమెంట్ల తో వీటిని బందీలని చెయ్యకుండా స్వేచ్ఛగా ఉంచడం ఎంతో ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news