జ్యోతిష్యుడి మాటలు నమ్మి కుటంబసభ్యుల వేధింపులు.. చివరికి..!

ప్రపంచం రోజురోజుకి సాంకెతికంగా అభివృద్ధి చెందుతుంది.. కానీ ఇప్పటికీ కొంతమంది మాత్రం మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. జ్యోతిష్యాలను పరిమితికి మించి నమ్మెస్తున్నారు.. ఓ జ్యోతిష్యుడి మాటలు నమ్మి ఇంటి కోడలను వేధింపులకు గురిచేసి చివరికి ఆ వివాహిత ప్రాణాలు పోగుట్టుకునేలా చేశారు.. ఈ విషాదకరసంఘటన కర్ణాటక రాజధాని బెంగుళూరు జరిగింది..

pregent

భార్యకి గర్భం రాలేదని భర్త, అత్తని కుటుంబ సభ్యులు ఆమెను జ్యోతిష్కుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన పిల్లలు పుట్టరని తేల్చి చెప్పాడు. పెళ్లై ఏడాది తిరక్కుండానే భార్య గర్భం దాల్చలేదంటూ భర్త, అతని కుటుంబ సభ్యులు సూటిపోటి మాటలతో చిత్రవధ చేశారు. పిల్లలు పుట్టకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లాలికానీ వాళ్లు జ్యోతిష్కుడిని సంప్రదించారు. ఆ జ్యోతిష్కుడు పిల్లలు పుట్టే అవకాశమే లేదని జోస్యం చెప్పడంటో కుటుంబసభ్యులు గుడ్డిగా నమ్మారు. వేధించటం మొదలుపెట్టారు. భరించలేని ఆ భార్య అఘాయిత్యానికి పాల్పడింది.

అగారా ఏరియాకి చెందిన అశ్విని(25)కి ఈ ఏడాది ఫిబ్రవరిలో యువరాజ్‌తో వివాహమైంది. కొద్దికాలం రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లై ఏడాది కూడా తిరక్కుండానే భార్య గర్భం దాల్చడం లేదంటూ అత్తింటి వారు సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురిచేసేవారు. భర్త, అతని కుటుంబసభ్యులు చిన్నవిషయానికి అశ్వినీతో గొడవపడేవారు. ఈ క్రమంలో అశ్విని వేరే గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేకే తన కుతూరు చనిపోయిందని కుమార్తె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై ఇప్పటికే పలువురు తమ అభిప్రాయాలు సామాజిక మాధ్యమం ద్వారా వ్యక్తం పరుస్తున్నారు. బెంగుళూరులో జరిగిన ఈ ఘటన అందరిని కలిచివేస్తుంది. సమస్యను పరిష్కరించుకోవాలంటే వైద్యలను సంప్రదించి మందులు వాడిఉంటే సమస్య పరిష్కారం అయి ఉండేది.. కాని జ్యోతిష్యులను నమ్మి అనవసరంగా ఆ ఇంటి కోడలను వాళ్లు పోగుట్టుకున్నారు. దేశంలో ఇలాంటి సంఘటనలు రోజూ జరుగుతునే ఉన్నాయి. సాంకేతికంగా మనం ముందుకెళుతున్నాం కానీ కొందరి నమ్మకాలు మనిషిని మానసికంగా కుంగదీస్తు పాతాలానికి కుంగదీస్తున్నాయి.