బెంగాల్ లో బిజెపి కౌన్సిలర్ హత్యను నిరసిస్తూ జరిగిన నిరసనలో కోల్‌కతా పోలీసులతో గొడవ జరిగిన సమయంలో సిక్కు వ్యక్తి తలపాగా ఊడిపోవడం వివాదాస్పదం అయింది. ఈ చర్యపై క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ… దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బల్విందర్ సింగ్ (46) అనే వ్యక్తి బిజెపి నాయకుడు ప్రియాన్షు పాండేకు ప్రైవేటు భద్రతా అధికారిగా ఉన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో… బల్విందర్ పై లాఠీ చార్జ్ చేసారు. ఈ గొడవలో అతని తలపాగా కూడా లాగేశారు. హర్భజన్ ట్వీట్ చేస్తూ, “ప్రియాన్షు పాండే భద్రతలో పోస్ట్ చేసిన బల్విందర్ సింగ్ యొక్క తలపాగా లాగడం… బెంగాల్ పోలీసుల అనాగరికతను చూపిస్తుంది. సిఎం మమతా బెనర్జీ దోషులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోండని ట్వీట్ చేసారు. దోషిగా ఉన్న పోలీసులపై ఐపిసి సెక్షన్ 295 ఎ పెట్టాలని డిమాండ్ చేసారు.
😡😡😡😡🤬 https://t.co/gLwxZviwRC
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 9, 2020