ఆర్బీఐ కీలక నిర్ణయం.. హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త..!

-

సొంత ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే మీరు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా. అయితే హోమ్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే ఇది మీకు గుడ్ న్యూస్. పండుగ సీజన్ నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో హోమ్ లోన్ తీసుకొని కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట కలుగనుందని అధికారులు తెలిపారు. వడ్డీ రేట్లు దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు.

Home loan
Home loan

అంతేకాదు రూ.30 లక్షలకు పైన హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గే అవకాశముందని తెలిపారు. ఇక రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం కారణంగా బ్యాంకులకు, ఫైనాన్స్ కంపెనీలు ఈ తరహా రుణాలపై వ్యయాలు తగ్గనున్నాయని తెలిపారు. దీంతో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు దిగివచ్చే అవకాశం ఉందన్నారు. మరీముఖ్యంగా రూ.75 లక్షలకు పైన హోమ్ లోన్ పొందే వారికే ఎక్కువ బెనిఫిట్ కలగొచ్చునని తెలిపారు.

ఇక ప్రస్తుతం హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు రుణ మొత్తంపై ఆధారపడి మారుతున్నాయని తెలిపారు. అయితే రూ.30 లక్షల వరకు హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయన్నారు. అంతేకాదు ఉదాహరణకు దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రూ.30 లక్షల వరకు రుణాలపై 7 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోందని తెలిపారు. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్యలో హోమ్ లోన్స్‌పై 7.25 శాతం వడ్డీని తీసుకుంటోందన్నారు.

అయితే రూ.75 లక్షలకు పైన హోమ్ లోన్స్‌పై ఎస్‌బీఐ 7.35 శాతం వడ్డీని వసూలు చేస్తోందని పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా వరుసగా 7.15, 7.25, 7.3-7.4 శాతం చొప్పున వడ్డీని విధిస్తోందన్నారు. ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా రూ.30 లక్షల వరకు అయితే 6.95 శాతం వడ్డీ తీసుకుంటోందన్నారు. ఆపైన రుణ మొత్తానికి 7.05 శాతం వడ్డీ తీసుకుంటోంది. ఆర్‌బీఐ శుక్రవారం నాటి పాలసీ సమీక్షలో 2022 మార్చి వరకు హోమ్ లోన్స్‌కు సంబంధించి రుణ మొత్తంతో కాకుండా ఎల్‌టీవీ ప్రాతిపదికన క్యాపిటల్ రిక్వైర్‌మెంట్ ఉంటుందని వెల్లడించిన విషయం తెలిసిన విదితమే..

Read more RELATED
Recommended to you

Latest news