‘శ్రీరాముడి’తో కాంగ్రెస్ పార్టీకి ఏంటి సమస్య : హార్ధిక్ పటేల్

-

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పాటీదార్ ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్ ఆ పార్టీపై విరుచుకుపడుతున్నారు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న హర్ధిక్ పటేల్ రాజీనామా చేయడం చర్చనీయాంశం అయింది. రాజీనామా తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ భగవాన్ శ్రీరాముడిని ఎందుకు అంతగా ద్వేషిస్తుందని ప్రశ్నించారు. రామ మందిర ఇటుకలపై కుక్క మూత్ర విసర్జన చేస్తుందని గుజరాత్ కాంగ్రెస్ నేత అనడంతో హార్ధిక్ పటేల్ ఘాటుగా స్పందించారు. ప్రజలు మనోభావాలను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని… హిందువుల మత విశ్వాసాలను దెబ్బతియడానికి ప్రయత్నిస్తుందంటూ ఆయన విమర్శించారు. కేంద్ర మాజీ మంత్రి, గుజరాత్ నాయకుడు ఈ వ్యాఖ్యలు చేయడాన్ని హర్థిక్ పటేల్ తీవ్రంగా తప్పుపట్టారు. శ్రీరాముడితో మీకు ఏం శత్రుత్వం అని కాంగ్రెస్ పార్టీని నిలదీశాడు. హిందువులను ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారు… శతాబ్ధాల తరువాత అయోధ్యలో శ్రీరాముడి ఆలయాన్ని నిర్మిస్తున్నారని… అయినప్పటికీ వ్యతిరేఖంగా ప్రకటనలు చేస్తూనే ఉన్నారంటూ ట్వీట్ చేశారు. గత వారం మే 18న హార్ధిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే త్వరలోనే బీజేపీ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news