క్రెడిట్ కార్డు కస్టమర్స్ కు అదిరిపోయే ఆఫర్స్ ను ఇచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్..!

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు భారీ తగ్గింపు ఆఫర్లు అందిస్తోంది. కేవలం ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో భాగంగానే క్రెడిట్ కార్డు వాడే వారికి ఇది ఒక శుభవార్త. ఇందులో డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌ బ్యాక్ కూడా పొందవచ్చు. బ్యాంకులు ఎప్పడికప్పుడు తమ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు అందిస్తూనే ఉంటాయి. అకర్షణీయ వడ్డీ రేటుకే రుణాలు ఇస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు బ్యాంకులు క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి అనేక బంపరాఫర్లు అందిస్తున్నాయి. వీటిల్లో ఒకటి అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్లకు భారీ తగ్గింపు ప్రయోజనాలు ఆఫర్ చేస్తోంది.

ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు బంపరాఫర్లు అందిస్తోంది. బ్యాంక్ దీని కోసం ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్‌ తో జత కట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారు అమెజాన్‌ లో షాపింగ్ చేసి మంచి క్యాష్ ‌బ్యాక్, డిస్కౌంట్‌ పొందొచ్చు. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ ఇక ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉండనుంది. రేపటితో ఈ ఆఫర్ల సేల్ ముగిసిపోతుంది. దీంతో క్రెడిట్ కార్డుపై ఆఫర్ కూడా ముగిసిపోతుంది. అందుకే ఎవరైనా ఏమైనా ప్రొడక్ట్ కొనుగోలు చేయాలని భావిస్తే అమెజాన్‌ లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో తగ్గింపు ప్రయోజనం పొందొచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వారికీ ఏకంగా రూ.8,250 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. కార్డు ద్వారా జరిపే అన్ని లావాదేవీలపై 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.అంటే దాదాపు రూ.1,500 తగ్గింపు పొందొచ్చు. అలాగే కస్టమర్లకు బోనస్ క్యాష్ ‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఇందులో రూ.30 వేలు లేదా ఆపైన జరిపిన లావాదేవీపై రూ.1,250 క్యాష్‌ బ్యాక్ వరుకు వస్తుంది. అదే మీరు కార్డు ద్వారా ఒకే ట్రాన్సాక్షన్‌ పై రూ.లక్ష లేదా ఆపై ఖర్చు చేస్తే ఏకంగా రూ.6,000 క్యాష్ ‌బ్యాక్ పొందొచ్చు. అంటే మీకు మొత్తంగా ఒక కార్డుపై దాదాపు రూ.8000 వరకు ఆదా చేసుకోవచ్చు.