తుర్కియే నుంచి భారత్​కు వస్తున్న నౌక హైజాక్

-

ఇజ్రాయెల్-హమాస్​ల మధ్య పోరు ఇంకా భీకరంగానే నడుస్తోంది. ఓవైపు హమాస్​ను అంతం చేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకు పడుతోంటే.. మరోవైపు హమాస్ దళాలు తిప్పికొడుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ పోరుతో గాజాలో సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. గాజాపై దాడులు ఆపాలని ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్​కు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గాజాకు మద్దతుగా యెమెన్​కు చెందిన హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ కార్గో నౌకను హైజాక్ చేశారు.

తుర్కియే నుంచి భారత్‌కు వస్తున్న ఇజ్రాయెల్‌ కార్గో నౌక గెలాక్సీ లీడర్​ను ఎర్ర సముద్రంలో హైజాక్‌ చేసినట్లు హౌతీ రెబల్స్‌ ప్రకటించారు. హమాస్​కు వ్యతిరేకంగా గాజాపై దాడులు ఆపేంత వరకు ఇజ్రాయల్​కు చెందిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా వీరు హైజాక్ చేసిన నౌకలో వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

అయితే హైజాక్ అయిన నౌకలో భారతీయులు, ఇజ్రాయెల్‌ పౌరులు ఎవరూ లేరని.. ఇజ్రాయెల్‌ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఇది అంతర్జాతీయ పర్యావసనాలకు సంబంధించిన తీవ్రమైన సమస్యగా పేర్కొంది ఇజ్రాయెల్ ట్వీట్ చేసింది. ఆ నౌక తుర్కియే నుంచి భారత్‌కు బయలు దేరిందని, అందులోని సిబ్బంది వివిధ దేశాలకు చెందిన వారని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news