ఢిల్లీలో ఇవాళ విద్యా సంస్థలు రీ ఓపెన్ కానున్నాయి. ఢిల్లో గాలి కాలుష్య తీవ్రత అలాగే ఉంది. దీపావళి తర్వాత నుంచి పెద్ద ఎత్తున గాలి కాలుష్యం ఏర్పడింది. ప్రజలు దీపావళి రోజు టపాసులు పేల్చడంతో పాటు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెడుతుండటంతో దేశ రాజధాని కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
తాజాగా ఓ అధ్యయనంలో ఢిల్లీలో ప్రతీ ఐదు కుటుంబాల్లో నాలుగు కుటుంబాలు కాలుష్యం బారిన పడినట్లు తేల్చింది. దీన్ని బట్ట చూస్తే ఢిల్లీలో కాలుష్యం ఏరేంజ్ లో ఉందో తెలుస్తోంది. దీపావళి తర్వాత నుంచి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) దారుణంగా ఉంది. ఇది ఇలా ఉండగా.. ఢిల్లీలో పొల్యూషన్ సెలవుల తర్వాత ఇవాళ తెరుచుకున్నాయి స్కూల్స్. ఢిల్లీలో పొల్యూషన్ పెరగడంతో గతవారం మొత్తం సెలవులు ప్రకటించింది ఢీల్లీ ప్రభుత్వం. అయితే… ఇవాళ ఢిల్లీలో విద్యా సంస్థలు రీ ఓపెన్ కానున్నాయి.