బీసీసీఐ సీనియర్ మెన్ చీఫ్ సెలెక్టర్ గా అజిత్ అగార్కర్ ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ఇతన్ని క్రికెట్ అడ్వైజరీ కమిటీలో సభ్యులు అయిన సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా మరియు జతిన్ పరాంజపే లు ఏకపక్షముగా హెడ్ సెలక్షన్ పనెల్ కు రికమెండ్ చేయడంతో, వీరి అభ్యర్థనను గౌరవించిన సెలక్షన్ పనెల్ అజిత్ అగార్కర్ ను కొత్త బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ గా నియమించింది.
అయితే చీఫ్ సెలెక్టర్ గా నియమితులైన అగర్కర్ కు రూ. 3కోట్ల వార్షిక వేతనం అందనుంది. అగార్కర్ ముందు వరకు ఈ వేతనం రూ. 1 కోటిగా ఉండగా… దీన్ని బీసీసీఐ మూడింతలు చేసింది. అగర్కర్ వేతనం గురించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయకపోయినా… క్రిక్ బజ్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఒక కోటి జీతం ఉండటంతో దిగ్గజ ఆటగాళ్లు ఎవరు ముందుకు రావడంలేదని, ఆరంభంలో అజిత్ అగర్కర్ కూడా జీతం చాలా తక్కువగా ఉందని, ఈ పదవిని స్వీకరించేందుకు నిరాకరించాడని పేర్కొంది. ఈ క్రమంలోనే చీఫ్ సెలెక్టర్ వార్షిక జీతాన్ని మూడు కోట్లకు పెంచిన బీసీసీఐ… ఇతర సెలెక్టర్ల వేతనాన్ని 90 లక్షలు పెంచినట్లు తెలిపింది.