హైదరాబాద్‌- అయోధ్య విమానం నిలిపివేత

-

ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట ఈ ఏడాది జనవరి 22న మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్‌ లగ్నంలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పండితుల సమక్షంలో 51అంగుళాల ఎత్తైన రామ్ లల్లా విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. మరుసటి రోజు నుంచి సామాన్య భక్తులకు అయోధ్యలో బాలరాముడి దర్శనం ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు బాలరాముడి దర్శనానికి తరలి వెళ్తున్నారు.

ఈ క్రమంలో పలు ప్రాంతాల నుంచి అయోధ్యకు స్పెషల్ రైళ్లు, విమాన సేవలు కూడా ఏర్పాటు చేశారు. అలా హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సేవలు నడిపారు. అయితే ఇన్నాళ్ల నుంచి నిర్వహిస్తున్న విమాన సర్వీసును ఈ నెల 1వ తేదీ నుంచి నిలిపివేసినట్లు స్పైస్‌ జెట్‌ వెల్లడించింది. ఈ మార్గంలో విమాన సేవలను రెండు నెలల క్రితం కంపెనీ ప్రారంభించిన విషయం తెలిసిందే. వారానికి 3 సర్వీసుల చొప్పున స్పైస్‌జెట్‌ విమానాలు నడిపింది. అయితే తగినంత గిరాకీ లేకపోవడంతో, ఈ సేవలను కంపెనీ నిలిపివేసినట్లు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news