మహా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఉద్ధవ్ థాక్రే సోదరుడు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాక్రే తాజాగా స్పందించారు. ఒక వ్యక్తి తన అదృష్టాన్ని సొంత విజయంగా భావించిన నాటి నుంచే అతని పతనం మొదలవుతుంది అని గురువారం ఆయన ఓ ట్వీట్ చేశారు. అయితే సీఎం పదవికి రాజీనామా చేసిన ఉద్దవ్ ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే.. నిజానికి అన్నదమ్ముల పిల్లలే అయినా.. శివసేన బాల్ థాకరే బతికున్నంతకాలం కలిసే ఉన్నారు. బాల్ ఠాక్రే మరణించిన కొన్నాళ్ళకు అన్న ఉద్దవ్ థాక్రే తో విభేదించిన తమ్ముడు రాజ్ థాక్రే వేరుకుంపటి పెట్టేసుకున్నారు.
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) పేరిట రాజ్ థాక్రే పెట్టిన పార్టీ పెద్దగా రాణించలేదు. ఫలితంగా రాజకీయంగా రాజ్ ఠాక్రే అంతగా యాక్టివేట్ చేయలేకపోయారు. అయితే తన సోదరుడు ఉద్దవ్ మహారాష్ట్ర సీఎం పదవికి బుధవారం రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ఘటన పై స్పందిస్తూ గురువారం రాజ్ థాక్రే ఈ ఆసక్తికర ట్వీట్ చేశారు. కాగా మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో అసెంబ్లీలో జరగాల్సిన బలపరీక్షలో రాజ్ ఠాక్రే తన మద్దతును బిజెపి,షిండే వర్గానికి ప్రకటించిన సంగతి తెలిసిందే.
— Raj Thackeray (@RajThackeray) June 30, 2022