సోనియా వద్దంటే రాహుల్…!

-

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉండాలి అని కాంగ్రెస్ కుటుంబ విధేయులు పలువురు కుండబద్దలు కొట్టి చెప్పేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ కూడా సోనియా గాంధీ వద్దు అనుకుంటే రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరించాలి అని మనసులో మాట చెప్పారు. సోనియా గాంధీ సమర్ధవంతమైన నేత అని, ఆమె బాధ్యతల నుంచి తప్పుకోవాలి అనుకుంటే రాహుల్ ఆ బాధ్యతలు స్వీకరించాలని కోరారు.

ఇక పార్టీలో ఉన్న యువనేతలు చాలా వరకు రాహుల్ గాంధీ తమ అధ్యక్షుడు అని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఆయన అయితే చాలా సమర్ధంగా పార్టీని పటిష్టం చేసే నేత అని చెప్తున్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు, చర్చించే అంశాలు ఎమై ఉంటాయి అనేది మీడియాకు పూర్తి వివరాలు అందలేదు.

Read more RELATED
Recommended to you

Latest news