యమునా నదిలో నీటిమట్టం భారీగా పెరుగుతోంది. దేళ రాజధాని ఢిల్లీ గుండా ప్రవహించే యమునా నదిలో ఈరోజు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి 208.46 మీటర్లకు చేరుకుంది నీటిమట్టం. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో తరలింపు చర్యలను వేగవంతం చేసింది ఢిల్లీ ప్రభుత్వం. ఇక ఈ రోజు ఉదయం 8-10 గంటలకు యమునాలోకి నీటి ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నందున “తీవ్ర పరిస్థితి” అని ప్రకటించింది కేంద్ర జల సంఘం.
ప్రమాదకర స్థాయికి మూడు మీటర్లపైన ప్రవహిస్తోంది యమునా నది. హర్యానాలోని “హత్నికుండ్” బ్యారేజీ నీటిని విడుదల చేయడంతో ఈరోజు ఉదయం 7 గంటలకు యమునాలో నీటిమట్టం
208.46 మీటర్లుగా నమోదైంది. యమునా బజార్, గర్హి మండ్, గీతాఘాట్, విశ్వకర్మ కాలనీ, ఖద్దా కాలనీ, పాత రైల్వే బ్రిడ్జి సమీపంలోని నీలి ఛత్రి దేవాలయం పరిసర ప్రాంతాలు, నీమ్ కరోలి గోశాల, వజీరాబాద్ నుంచి మజ్ను కతిలా” వరకు రింగ్‌రోడ్‌లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక వరదల కారణంగా యమునా నదికి సమీపంలో ఉన్న గీతా కాలనీ శ్మశానవాటికను మూసివేశారు అధికారులు.