బాలీవుడ్​లో మరో కొత్త ప్రేమజంట.. సోషల్ మీడియాలో లీకైన ఫొటోలు

-

బాలీవుడ్​లో మరో కొత్త ప్రేమజంట వెలుగులోకి వచ్చింది. విదేశీ విహార యాత్రలో ఉన్న ఈ జంట కెమెరా కంటికి చిక్కింది. ఆ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో ఈ విషయం బయటపడింది. ఇంతకీ ఆ జంట ఎవరంటే.. బీ టౌన్ స్టార్ కిడ్ అనన్యా పాండే.. బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్యా రాయ్​కపూర్. ఈ ఇద్దరూ రిలేషన్​షిప్​లో ఉన్నారంటూ గత కొంతకాలంగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. కలిసి పార్టీలకు హాజరవ్వడం.. డిన్నర్ డేట్​లకు వెళ్లడంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే ఇప్పుడు ఏకంగా స్పెయిన్‌ టూర్‌లో ఉన్న వీరిద్దరూ అక్కడి వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలు వైరల్ అవ్వడంతో వీరిద్దరి రిలేషన్​షిప్​ను కన్ఫామ్ చేశారు నెటిజన్లు. ఈ ఫొటోల్లో ఆదిత్య.. అనన్యను హగ్​ చేసుకుని.. చుట్టూ ఉన్న పరిసరాలను వీక్షిస్తూ దర్శనమిచ్చాడు. వీటిని చూసిన నెటిజన్లు.. ‘బాలీవుడ్‌లో కొత్త ప్రేమజంట’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక, ఆదిత్య అంటే తనకు ఇష్టమని, అతడి లుక్స్‌ బాగుంటాయని గతంలో ఓ కార్యక్రమంలో అనన్య చెప్పింది. ఆ షో తర్వాత నుంచి ఈ జోడీ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news