నిజామాబాద్ కి పుసుపు బోర్డు తీసుకొస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఇచ్చింది. ముఖ్యంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ నిజామాబాద్ జిల్లా అంకాపూర్ కి చెందిన పల్లె గంగారెడ్డి నియామకయ్యారు. నిజామాబాద్ జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని వర్చువల్ గా ఇవాళ ఢిల్లీ నుంచి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రారంభించారు. ఆయన వెంటన ఎంపీ అర్వింద్ కూడా ఉన్నారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ పసుపు బోర్డును సరైన దిశలో నడిపించాలన్నారు. పల్లె గంగారెడ్డి పై బృహత్తర బాధ్యతను పెట్టామని తెలిపారు. సంక్రాంతి పర్వదినం రోజున పసుపు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డును గిప్ట్ గా ఇచ్చారని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సందర్భంగా మోడీ ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును ఏర్పాటు చేసారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.