అనూహ్య ఫలితాలు సాధించిన ఇండియా కూటమి.. 233 స్థానాల్లో గెలుపు

-

2024 లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్​ అనూహ్య ఫలితాలు సాధించింది. 233 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. ఇండియా కూటమిలో 99 సీట్లతో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ ఉండగా.. తమిళనాడులోని మొత్తం 39 సీట్లు ఇండియా కూటమి దక్కించుకుంది. తమిళనాడులో డీఎంకేసొంతంగా 22 స్థానాల్లో గెలిచింది. మరోవైపు యూపీలో 37 సీట్లలో సమాజ్‌వాద్‌ పార్టీ విజయం సాధించగా.. బంగాల్‌లో 29 స్థానాల్లో మమతా బెనర్జీ(టీఎంసీ) సత్తా చాటింది. ఇక మహారాష్ట్రలో 9 స్థానాల్లో శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే పార్టీ గెలవగా.. 8 స్థానాల్లో గెలిచిన శరద్‌ పవార్‌ వర్గం ఎన్‌సీపీ విజయం సాధించింది.

ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తూ బీజేపీ కూటమిని నిలువరించకపోయినా, ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండేందుకు చేసిన ప్రయత్నంలో సఫలం అయింది. సమర్థమైన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు తన బలాన్ని మరింత పెంచుకుంది. 2019 లోక్​సభ పోల్స్​లో 52 సీట్లు సాధించిన కాంగ్రెస్, ఈ ఎన్నికల్లో తన బలాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇతర ప్రధాన పార్టీలు కూడా అదే తరహాలో గట్టి పోటీ ఇచ్చాయి

Read more RELATED
Recommended to you

Latest news