కేంద్రం అందిస్తున్న ఈ పథకంతో 50 లక్షల సబ్సిడీ, కోటి రూపాయల ప్రయోజనాలు పొందవచ్చు! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం చాలా విధాలుగా ఎన్నో పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సరికొత్త పథకాలను అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం మరొక పథకాన్ని ప్రజల ముందుకు తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం గతంలో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనే ఒక కొత్త పథకాన్ని ప్రజల కోసం తీసుకువచ్చింది.
దీని ద్వారా ఎవరైతే కోళ్ల, మేకలు పందుల పెంపకం వంటి పరిశ్రమలను ప్రారంభిస్తారో అలాంటి వారికి సబ్సిడీ రూపంలో డబ్బును చెల్లించనుంది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 50 లక్షల దాకా సబ్సిడీ రూపంలో ఇవ్వనుంది. దీన్ని కేంద్రంలోని పశు సంవర్ధక, కోళ్లఫారాల శాఖ నిర్వహిస్తోంది. ఈ పథకం కింద లబ్ది పొందేవారికి కేంద్రం స్కిల్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. అలాగే కొత్త టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో కూడా ట్రైనింగ్ ఇస్తారు.ఈ పథకాన్ని ఎవరు పొందగలరు ఇంకా ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం.
ఇలా అప్లై చేసుకోండి :
ఈ స్కీంని సింగిల్ వ్యక్తి పొందవచ్చు లేదా కొంతమంది కలిసి.. గ్రూపుగా ఏర్పడి పొందవచ్చు లేదా సహకార సంఘంగా, స్వయం సహాయక బృందంగా ఏర్పడి కూడా పొందవచ్చు. ఇదోక రుణ పథకం. ఇందులో రూ.కోటి రూపాయలు ఇస్తారు. కానీ ఇందులో రూ.50 లక్షలకు మాత్రం రాయితీ ఇస్తారు. ఈ రాయితీని కూడా 2 విడతల్లో ఇస్తారు. నాబార్డ్ సహకారంతో ఈ పథకం అమలువుతుంది. రుణంగా ఇచ్చే రూ.50 లక్షల్లో రూ.40 లక్షల డబ్బును బ్యాంకులు ఇస్తాయి. మిగిలిన రూ.10 లక్షలను లబ్దిదారులు పెట్టుకోవాలి. ఇక ఈ పథకాన్ని అన్ని సామాజిక వర్గాలవారూ పొందవచ్చు. అయితే కండీషన్లు కూడా ఉన్నాయి. ఈ పథకంలో ఇచ్చే డబ్బుతో 500 ఆడమేకలు లేదా గొర్రెలు, 25 పోతులను కొనాలి. వాటిని 1 ఎకరం నుంచి 5 ఎకరాల సొంత స్థలం లేదా లీజుకి తీసుకున్న స్థలంలో మాత్రమే పెంచాలి. ఇక ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పథకాన్ని అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
ముందుగా మీరు https://nlm.udyamimitra.in/Home/SchemePage అనే వెబ్‌సైట్ లోకి వెళ్లాలి. ఈ వెబ్ సైట్ లో ముందు మీరు మీ మొబైల్ నెంబర్ తో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు లాగిన్ అయ్యాక అప్లికేషన్ లో మీ పేరు, అడ్రెస్, షెడ్డు నిర్మాణ వివరాలు, గ్రాసం పెంచే చోటు ఇంకా స్థానిక పశు వైద్య అధికారి ధ్రువీకరణ సర్టిఫికెట్ వంటి వివరాల్ని ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటిని ఇచ్చిన తరువాత మీ వివరాలు చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ పై క్లిక్ చెయ్యాలి. దాంతో మొత్తం వెరిఫై అయిన తరువాత మీ అప్లికేషన్ పూర్తవుతుంది. ఇక మీరు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం అప్లై చేసుకున్న తరువాత పశు సంవర్ధక శాఖ అధికారులు అప్లికేషన్ లో మీరు చెప్పిన అడ్రెస్‌కి వస్తారు. అక్కడ గొర్రెలు, మేకలు పెంచడానికి వీలు ఉందో లేదో చూస్తారు. ఇక అంతా బాగానే ఉంటే.. మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలా మీరు ఈ పథకాన్ని పొందవచ్చు.