ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా.. దేశంలో కొత్తగా 15102 పాజిటివ్ కేసులు

-

మన దేశంలో కరోనా మహమ్మారి కేసులు నిన్నటి వరకు భారీగా తగ్గి పోయాయి. అయితే.. ఇవాళ మాత్రం ఒక్కసారిగా కరోనా కేసులు ఎగిసి పడ్డాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 15102 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,28,67,031 కు చేరింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,64,522 కు చేరింది.ఇక దేశం లో కరోనా పా జిటివిటి రేటు 96.62 శాతం గా ఉంది. ఇక దేశంలో తాజాగా 278 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,12,622 కి చేరింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 31377 మంది కరోనా నుంచి కోలు కున్నారు.ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,21,89,887 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,76,19,39,020 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 33,84,744 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version