
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ 19 వాక్సిన్ 50 లక్షల డోస్‌లు పూర్తి చేయడం ఎంతో అభినందనీయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్, జాయింట్ కలెక్టర్ శాంసన్, జేసీ నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.