హసీనాను మాకు అప్పగిస్తారో లేదో భారత్ ఇష్టం : బంగ్లా

-

బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను తీసుకొచ్చి న్యాయస్థానంలో నిలబెట్టేందుకు అన్ని అవకాశాలను వాడుకుంటున్నామని బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ అన్నారు. అయితే, ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పగించాలా? లేదా అనేది భారత్ ఇష్టమని చెప్పారు. ‘మా న్యాయవ్యవస్థ కోరుకుంటే హసీనాను తప్పకుండా వెనక్కి రప్పిస్తాం. న్యాయ ప్రక్రియకు సంబంధించి భారత్‌తో బంగ్లాకు ఒప్పందం ఉంది. దీనిపై వదంతులు వ్యాప్తి చేయకపోవడమే మంచిది’ అని ఆయన వెల్లడించారు.

బంగ్లాదేశ్‌లో మాజీ సైనికుల కుటుంబాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆ దేశంలో అల్లర్లు నెలకొని అట్టుడుకిన విషయం తెలిసిందే. అవి కాస్త తీవ్రరూపం దాల్చడంతో సైన్యం జరిపిన కాల్పుల్లో సుమారు 300లకు పైగా సామాన్య పౌరులు మరణించారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని సైన్యం చేతుల్లోకి తీసుకోవడంతో బంగ్లా ప్రధాని తన ప్రాణాలు కాపాడుకోవడానికి భారత్‌కు వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. తాజాగా ఆమెను బంగ్లాకు అప్పగించాలా? లేదా అనే విషయంపై నేటికి భారత్ ఇంకా స్పందించలేదు. అయితే, గతంలో ఆమె లండన్ వెళతారని అంతా భావించినా బ్రిటన్ నుంచి ఆమెకు సమ్మతి లభించకపోవడంతో ఇండియాలోనే ఉండిపోయారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news