హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. 25 పబ్బుల్లో సోదాలు!

-

తెలంగాణలో డ్రగ్స్ మరోసారి కలకలం సృష్టించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతుండగా, సరఫరా చేసే వారిపై కఠిన చర్యలకు ఆదేశించింది. అయినప్పటికీ మత్తు పదార్థాల వినియోగం రాష్ట్రంలో తగ్గడం లేదు. రాత్రుళ్లు మత్తు బాబులు నషాలో మునిగి తేలుతున్నారు. తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్థరాత్రి ఎక్సైజ్, టీఎస్ నాబ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

drugs

ఈ రైడ్స్ లో డ్రగ్స్ వినియోగిస్తున్న 107 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 25 పబ్బుల్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పట్టుబడిన వారికి డ్రగ్ డిటెక్షర్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. గత రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఈ తనిఖీలు కొనసాగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రధాన కూడళ్లల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను సైతం పోలీసులు పెంచారు. నగరంలో శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా రాత్రుళ్లు పెట్రోలింగ్ పెంచినట్లు అధికారులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news