మంకీపాక్స్ అలర్ట్.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం

-

కరోనా మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని మరో మహమ్మారి హడలెత్తిస్తోంది. మంకీపాక్స్ వైరస్ ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటి వరకు ఇండియాలో మంకీపాక్స్ కేసులు లేకున్నా.. ముందస్తు చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి, వారికి వైద్యం అందిచడానికి ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు దిల్లీలో మూడు నోడల్‌ ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇక విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అనుమానితులకు RT-PCR వ్యాధి నిర్థరణ పరీక్ష చేయాలని మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆఫ్రికాలో ఈ ఏడాది 18 వేలకుపైగా మంకీపాక్స్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. పొరుగుదేశం పాకిస్తాన్‌లోనూ మంకీపాక్స్‌ కేసులు వెలుగుచూడటంతో భారత్ అప్రమత్తమైంది.

Read more RELATED
Recommended to you

Latest news