ఇండియన్ రైల్వే: ఫైవ్ స్టార్ హోటల్ తరహా సౌకర్యం

-

ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్ సరికొత్త సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఇండియన్ రైల్వేస్, ది ప్రైడ్ గ్రూప్ హోటల్స్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇకపై రైలులో ప్రయాణించే ప్రయాణికులకు లగ్జరీతో కూడిన సేవలు పొందవచ్చు. దేశంలోని అన్ని ప్రైడ్ గ్రూప్ హోటళ్లలో గదులను ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తోంది.

railway

ప్రైడ్ హోటళ్లు లగ్జరీతో కూడుకున్నవి. ఇందులో ప్రయాణికులకు అత్యంత సురక్షితమైన స్టే లభిస్తుందని రైల్వేశాఖ భావిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను పైడ్ హోటల్స్ గ్రూప్ శుక్రవారం ప్రకటన జారీ చేసింది. ఇకపై ప్రయాణికులు తమ ట్రైన్ టికెట్‌తోపాటు హోటల్ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. హోటల్స్ రూమ్స్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని.. తప్పకుండా సేవలు వినియోగించుకోవాలని సూచించింది.

ప్రైడ్ హోటల్స్ గ్రూప్ సంస్థ ప్రయాణికులకు ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో సౌకర్యాలను కల్పిస్తోంది. ఇందులో వైఫై సదుపాయం, ఏసీ సదుపాయం, 24 గంటలు కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ఇవ్వనుంది. ఈ ఒప్పందంతో ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరడానికి టికెట్లు తీసుకోవడంతోపాటు.. హోటల్స్ కూడా సులభంగా బుక్ చేసుకోవచ్చని ప్రైడ్ హోటల్స్ గ్రూప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వీపీ అమిత్ సిదానా పేర్కొన్నారు. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

కరోనా నేపథ్యంలో ఎలాంటి సదుపాయాలు ఉంటాయోనని ఆందోళన వద్దని.. ప్రైడ్ సేఫ్టీ ఎష్యూరెన్స్ (సురక్షిత హామీ) కల్పిస్తున్నట్లు అమిత్ సిదానా తెలిపారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేందుకు ప్రైడ్ సేఫ్టీ ఎష్యూరెన్స్ పనిచేస్తుందన్నారు. బుకింగ్ పాలసీని ప్రతి ఒక్కరూ పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు, ప్రయాణికుల భద్రతే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. కాగా, ఐఆర్‌సీటీసీ వెబ్ పోర్టల్‌ను రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ 2020 అక్టోబర్ 31వ తేదీన అప్‌గ్రేడ్ చేశారు. దీంతో ఈ వెబ్ పోర్టల్‌లో రైల్వే శాఖకు సంబంధించిన అన్ని సౌకర్యాలు, ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news