చరిత్రలో మొదటిసారి.. 5 ట్రిలియన్ల డాలర్లలోకి భారత స్టాక్ మార్కెట్..!

-

చరిత్రలో మొట్టమొదటిసారిగా నేడు భారత స్టాక్ మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లుగా నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. భారత స్టాక్ మార్కెట్ గత 6 నెలల కాలంలోనే 1 ట్రిలియన్ డాలర్ల సంపదను సృష్టించి ఎన్నడూ లేనివిధంగా అరుదైన రికార్డులను నెలకొల్పింది. దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా ఎన్నికల వాతావరణం ఉంది. దీంతో విదేశీ పెట్టుబడులు ప్రతికూలంగా ఉన్నప్పటికి భారత స్టాక్ మార్కెట్లు ఈ వృద్ధిని సాధించాయి. మరోవైపు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం మార్కెట్ విలువ రూ.414. 75 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వృద్ధి ఎన్నికల తర్వాత కూడా ఇలాగే కొనసాగితే భారత్ త్వరలోనే అన్ని రంగాల్లో మరింత వృద్ధిని సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నేడు భారత స్టాక్ మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లుగా నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. భారత స్టాక్ మార్కెట్ గత 6 నెలల కాలంలోనే 1 ట్రిలియన్ డాలర్ల సంపదను సృష్టించింది. దేశంలోని బలమైన ప్రభుత్వానికి మదుపరుల నుంచి లభిస్తున్న అపూర్వమైన మద్దతుకు ఇది నిదర్శనం.

Read more RELATED
Recommended to you

Latest news