తెలంగాణ సర్కారు పై హరీశ్ రావు సీరియస్.. ఒక్క మంత్రి గ్రౌండ్ లో లేరంటూ..!

-

తెలంగాణలో వడ్ల చుట్టూ పాలిటిక్స్ పీక్స్ కు చేరింది. కాంగ్రెస్ సన్న వడ్లకు మాత్రమే బోనస్ అని ప్రకటించడం పట్ల బీజేపీ, బీఆర్ఎస్ సీరియస్ అవుతున్నాయి. తాజాగా బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే  హరీశ్ రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో పర్యటించారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడ్ల కొనుగోలు పరిస్థితి క్షేత్రస్థాయిలో వేరేలా ఉందన్నారు. తరుగు లేకుండా వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

తడిసిన, మొలకెత్తిన వడ్లు కూడా కొనుగోలు చేయాలన్నారు. సన్నవడ్లకే రూ.500 బోనస్ అనడం రైతులను మోసం చేయడమే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రులు కల్లాల్లో తిరిగేవారని.. ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఒక్క  మంత్రి కూడా సందర్శించడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news