రైలు ప్రయాణికులకు అలర్ట్..35 పైసలతో రూ. 10 లక్షల బీమా.. అస్సలు మర్చిపోకండి

-

మొన్న రాత్రి ఒడిస్సా లో రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కోరమండల్ ఎక్స్ప్రెస్ ట్రైన్… గూడ్స్ రైలు ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో చాలామంది క్షతగాత్రులు అయ్యారు. అలాగే 280 మందికి పైగా మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. అయితే రైలులో ప్రయాణించేటప్పుడు… ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఇప్పుడు నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఇన్సూరెన్స్ చేసుకోవడం ఎలా.. ఇన్సూరెన్స్ పాలసీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరైనా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు కచ్చితంగా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. రైలు ప్రయాణం కోసం ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దీనివల్ల కేవలం 45 పైసలకే 10 లక్షల బీమా కవర్ అవుతుంది. ఈ ఆప్షన్ ను కచ్చితంగా క్లిక్ చేయండి. రైలు ప్రయాణ సమయంలో దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే… ఆ బీమా డబ్బు మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news